హీరోయిన్‌ దొరికింది

Olivia Morris, Ray Stevenson, Alison Doody join Jr NTR, Ram Charan in RRR - Sakshi

ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌ కుదిరింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఇంగ్లీష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తారని గతంలో ప్రకటించారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొత్త హీరోయిన్‌పై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌తో ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటించనున్న హీరోయిన్, నెగటివ్‌ రోల్స్‌లో కనిపించే పాత్రలను బుధవారం ప్రకటించారు. ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌ విలన్లుగా కనిస్తారు. జెన్నీఫర్‌ పాత్రలో ఒలీవియా మోరిస్, స్కాట్‌ పాత్రలో రే స్టీవెన్‌సన్, అలిసన్‌ డూడీ లేడీ స్కాట్‌గా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది పది భాషల్లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top