ఫ్లాప్ డైరెక్టర్తో ఎన్టీఆర్..? | Ntr Next with Sardar Gabbarsingh fame Bobby | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ డైరెక్టర్తో ఎన్టీఆర్..?

Nov 23 2016 10:50 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఫ్లాప్ డైరెక్టర్తో ఎన్టీఆర్..? - Sakshi

ఫ్లాప్ డైరెక్టర్తో ఎన్టీఆర్..?

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి రెండున్నర నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు.

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి రెండున్నర నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. జనతా గ్యారేజ్తో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన జూనియర్ నెక్ట్స్ సినిమా ఏ జానర్లో చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో చాలా మంది దర్శకులు జూనియర్తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. ఎవరికీ ఓకె చెప్పటం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్స్ లిస్ట్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించగా.. తాజాగా ఓ ఫ్లాప్ సినిమా దర్శకుడితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది.

పవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బాబీ. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన బాబీ రెండో సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. పవన్ హీరోగా సర్థార్ గబ్బర్సింగ్ సినిమాను తెరకెక్కించిన బాబీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.  ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో బాబీ కెరీర్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో తన తొలి సినిమా హీరో రవితేజతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.

రవితేజ ప్రస్తుతం సినిమా చేసే మూడ్లో లేకపోవటంతో ఎన్టీఆర్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్కు లైన్ కూడా వినిపించిన బాబీ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్ తరువాత జూనియర్, బాబీతో సినిమాకు అంగీకరిస్తాడా..? లేక ఇది కూడా గతంలో వచ్చిన వార్తల్లాగే గాసిప్ అని కొట్టి పారేస్తారా..? చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement