మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను! | NTR Jr's Rabhasa release confirmed on Aug 29 | Sakshi
Sakshi News home page

మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను!

Aug 10 2014 11:44 PM | Updated on Sep 2 2017 11:41 AM

మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను!

మా రెండో అబ్బాయిని కూడా హీరోని చేస్తాను!

మా అబ్బాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ విడుదలై ఇప్పటికి మూడు వారాలైంది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది కాబట్టి, ఎన్టీఆర్ హీరోగా నేను నిర్మిస్తున్న

‘‘మా అబ్బాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ విడుదలై ఇప్పటికి మూడు వారాలైంది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది కాబట్టి, ఎన్టీఆర్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘రభస’ విడుదలను వాయిదా వేశామని అనుకుంటున్నారు. కానీ, అందులో నిజం లేదు’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంకొండ మాట్లాడుతూ- ‘‘ఈ నెల 15న ‘రభస’ను విడుదల చేయాలనుకున్నాం.

 కానీ, ఇంకొన్ని కార్యక్రమాలు పూర్తి కావాలి. అందుకే వాయిదా వేశాం. ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. శ్రీనివాస్‌కి బయటి సంస్థల్లో అవకాశాలు వచ్చాయని బెల్లంకొండ చెబుతూ - ‘‘మీ అబ్బాయి బాగా నటించాడని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. తొలి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించినా, అందుకు తగ్గ వసూళ్లు రాబడుతోంది కాబట్టి, మలి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే నిర్మించడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.

బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రాన్ని నా సంస్థలోనే తీయాలా? లేక బయటి సంస్థకు ఇవ్వాలా? అనేది నిర్ణయించలేదు’’ అన్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ని ఎంపిక చేశారట? అనే ప్రశ్నకు, ఇంకా కథానాయికను ఖరారు చేయలేదని చెప్పారు బెల్లంకొండ. తన రెండో కుమారుడు గణేశ్‌ని కూడా హీరోని చేయాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement