పోరాటం మొదలైంది

NTR and Charan to resume shoot for RRR - Sakshi

బ్రిటీషర్స్‌పై యుద్ధం మొదలెట్టారు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు. ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో తెలియాల్సి ఉంది.  ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ కథానాయిక. చరణ్‌ సరసన ఆలియా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారన్నది ఇంకా ఫిక్స్‌ కాలేదు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, నిత్యా మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, జిమ్‌లో గాయపడిన కారణంగా చరణ్‌ కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఈ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్‌ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హీరోలూ జోష్‌గా ఈ సెట్‌లోకి ఎంటరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ఆరంభం అయింది. నగర శివార్లలో వేసిన సెట్లో ఈ షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. దాదాపు నెలరోజులకు పైనే ఈ షెడ్యూల్‌ సాగనుందని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top