'కత్రినా పెళ్లి ఇప్పట్లో లేదు' | No wedding plans yet for Katrina, says spokesperson | Sakshi
Sakshi News home page

'కత్రినా పెళ్లి ఇప్పట్లో లేదు'

May 12 2015 2:52 PM | Updated on Sep 3 2017 1:54 AM

'కత్రినా పెళ్లి ఇప్పట్లో లేదు'

'కత్రినా పెళ్లి ఇప్పట్లో లేదు'

కత్రినా కైఫ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదని ఆమె ప్రతినిధి స్పష్టం చేశారు.

బాలీవుడ్ హాట్ జంట కత్రినా కైఫ్.. రణబీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారని, ముగ్గురు పిల్లలను కంటారని ఇటీవలి కాలంలో విపరీతంగా మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. అయితే.. కత్రినా మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదని ఆమె ప్రతినిధి స్పష్టం చేశారు. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు.

వచ్చే ఏడాది కత్రినా - రణబీర్ల పెళ్లి ఉందని ఇప్పటికే జాతీయ మీడియాలో పలు రకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నెలాఖరులోనే వాళ్ల నిశ్చితార్థం కూడా జరుగుతుందన్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్తో కలిసి 'ఫితూర్', అనురాగ్ బసు తీస్తున్న 'జగ్గా జాసూస్' చిత్రాల్లో కత్రినా నటిస్తోంది. ప్రస్తుతం తొలిసారిగా కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఫ్రెంచి రివెరాకు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement