‘మిత్రోం’ ఇది తగునా..? | No Credits To Pelli chupulu Director Tharun Bhascker | Sakshi
Sakshi News home page

Aug 16 2018 12:38 PM | Updated on Aug 16 2018 3:43 PM

No Credits To Pelli chupulu Director Tharun Bhascker - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. డీసెంట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్‌ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కామెడీతో ఆకట్టుకున్న పెళ్లిచూపులు తరుణ్‌ కు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టడమే కాదు. దర్శకుడిగా రచయితగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిపెట్టింది.

అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో మిత్రోం పేరుతో రీమేక్ చేశారు. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల రిలీజ్‌ అయ్యింది. నేటివిటీ పరంగా మార్పులు చేసిన ట్రైలర్‌లో ప్రతీ సీన్‌ ఒరిజినల్‌ వర్షన్‌లో కనిపించిందే. అయితే టైటిల్‌ లో మాత్రం ఎక్కడా తరుణ్‌ భాస్కర్‌ ప్రస్తావన్‌ లేదు. కథా కథనాలు పెళ్లి చూపులు నుంచే తీసుకున్నారు కాబట్టి తప్పుకుండా తరుణ్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.  

అయితే ఒరిజినల్‌గా కథా కథనాలు తయారు చేసిన తరుణ్‌భాస్కర్‌కు క్రెడిట్‌ ఇవ్వకపోగా రచయితగా శరిబ్‌ హష్మీ పేరు వేశారు.  దీంతో హిందీలో రీమేక్‌ చేసిన దర్శక నిర్మాతలు క్రెడిట్‌ ఇవ్వకపోవటం అన్యాయం అన్న టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మిత్రోం చిత్ర దర్శకుడు నితిన్‌ కక్కర్‌, నిర్మాత విక్రమ్‌ మల్హోత్ర ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement