'డాన్ 3' రూమర్స్కు చెక్! | No Change in Don 3 Cast confirms rithesh sidhwani | Sakshi
Sakshi News home page

'డాన్ 3' రూమర్స్కు చెక్!

Oct 15 2015 3:02 PM | Updated on Sep 3 2017 11:01 AM

'డాన్ 3' రూమర్స్కు చెక్!

'డాన్ 3' రూమర్స్కు చెక్!

'డాన్ 3' సినిమా విషయంలో వస్తున్న రూమర్స్కు నిర్మాత రితేష్ సిద్వాని చెక్ పెట్టారు. డాన్, డాన్ 2 సినిమాల్లో నటించిన అదే నటీనటులతో ఈ సీరిస్ లో మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా...

'డాన్ 3' సినిమా విషయంలో వస్తున్న రూమర్స్కు నిర్మాత రితేష్ సిద్వాని చెక్ పెట్టారు. డాన్, డాన్ 2 సినిమాల్లో నటించిన అదే నటీనటులతో ఈ సిరీస్ లో మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ మూవీకు రీమేక్గా తెరకెక్కిన షారూక్ ఖాన్ డాన్ మంచి సక్సెస్ సాధించింది.

2006లో అదే లైన్ తో 'డాన్ 2' సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా టాక్ పరంగా నిరాశపరిచినా... కలెక్షన్ల పరంగా మాత్రం ఆకట్టుకుంది. దీంతో డాన్ 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా సీక్వెల్ పై చర్చ మొదలైంది. అయితే షారూఖ్ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతూ వచ్చింది. అదే సమయంలో 'డాన్ 3' కోసం కొత్త నటీనటులను ఎంపిక చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది.

అమితాబ్ షారూఖ్ లు కనిపించిన డాన్ పాత్రలో ఈ సారి మరో నటుడు కనిపించనున్నాడని భావించారు అంతా. ఈ గాసిప్స్ అన్నింటికి చెక్ పెట్టాడు నిర్మాత రితేష్ సిద్వాని. డాన్ 3లోనే షారూఖ్.. డాన్ గా నటిస్తాడని ప్రకటించిన రితేష్, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. షారూఖ్ తో పాటు తొలి రెండు భాగాల్లో నటించిన ప్రియాంక చోప్రా, బొమన్ ఇరానీలు కూడా ఈ మూడో భాగంలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement