రజనీ ఫ్యాన్స్కు నిరాశే..! | no audio release function for kabali | Sakshi
Sakshi News home page

రజనీ ఫ్యాన్స్కు నిరాశే..!

Jun 7 2016 8:28 AM | Updated on Sep 4 2017 1:55 AM

రజనీ ఫ్యాన్స్కు నిరాశే..!

రజనీ ఫ్యాన్స్కు నిరాశే..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జులై 1న రిలీజ్కు రెడీ అవుతోంది....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జులై 1న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇటీవల  రిలీజ్ అయిన కబాలి టీజర్ ఆన్లైన్లో సంచలనాలు సృష్టిస్తుండగా.. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ఈ నెల 12న కబాలి ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా, కబాలి ఆడియోను ఎలాంటి ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయానలని భావిస్తున్నారట. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కబాలి చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అభిమానుల అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

రెండు భారీ ఫ్లాప్ల తరువాత రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ధన్సికతో పాటు పలువురు మలేషియన్ నటులు కూడా విలన్ రోల్స్లో కనిపించనున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డ్లు సృష్టిస్తున్న కబాలి, రిలీజ్ తరువాత మరిన్ని రికార్డ్లు బద్దలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement