లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ | Nivin Pauly wraps up Kayamkulam Kochunni | Sakshi
Sakshi News home page

లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌

Jun 3 2018 3:21 AM | Updated on Jun 3 2018 3:21 AM

Nivin Pauly wraps up Kayamkulam Kochunni - Sakshi

నివిన్‌ పౌలి, మోహన్‌లాల్‌

దాదాపు 3,864 గంటలు.. అంటే 161 రోజులు దొంగగా ఉన్నారు మలయాళ నటుడు నివిన్‌ పౌలి. కన్‌ఫ్యూజ్‌ అవ్వకండి. ఇదంతా.. ఆయన హీరోగా నటించిన ‘కాయమ్‌కులమ్‌ కొచ్చున్‌’ సినిమా గురించి. ‘నోట్‌బుక్‌’ ఫేమ్‌ రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 19వ శతాబ్దంలో దారి దోపిడీ దొంగగా సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌ ప్రాంతాన్ని గడగడలాడించిన కాయమ్‌కులమ్‌ కొచ్చున్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌లాల్‌ కీలక పాత్ర చేసిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్‌ కథానాయిక. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. ‘‘సెట్‌ ఆఫ్‌ ఇన్‌స్పైరింగ్‌ పీపుల్స్‌తో 161 డేస్‌ వర్క్‌ చేశాను. ఈ ఒక్క సినిమాతో లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందిన అనుభూతి కలిగింది’’ అని పేర్కొన్నారు నివిన్‌ పౌలి. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement