దేశం కోసం... | Nitin Nash Production No.1 Movie Launched | Sakshi
Sakshi News home page

దేశం కోసం...

Sep 2 2014 11:28 PM | Updated on Sep 2 2017 12:46 PM

దేశం కోసం...

దేశం కోసం...

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నితిన్ నాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ, జి. రవికుమార్, అనిల్ త్రెహాన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. జి. రవికుమార్ దర్శకుడు.

 తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నితిన్ నాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ, జి. రవికుమార్, అనిల్ త్రెహాన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. జి. రవికుమార్ దర్శకుడు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, యాక్షన్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. దేశం కోసం ఓ యువకుడు ఏం చేశాడు? అనేది చిత్రకథ.
 
 ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ప్రేమకథ. 70 శాతం షూటింగ్ ముంబయ్‌లో జరుపుతాం. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను కాశ్మీర్‌లో చిత్రీకరిస్తాం. ఓ కీలక పాత్రను మురళీమోహన్‌గారు చేస్తున్నారు. ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్‌గార్ని అడగాలనుకుంటున్నాం. ప్రముఖ నిర్మాత ఎ.యం. రత్నం రాసిన పాటలు, కబీర్‌లాల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయి’’ అని చెప్పారు. రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని కబీర్‌లాల్ అన్నారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందని నితిన్ నాష్ చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement