ఐరన్‌ లేడీ!

Nithya Menen to play J Jayalalitha in a biopic titled The Iron Lady - Sakshi

ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్‌ అనౌన్స్‌ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్‌ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ టైటిల్‌ రోల్‌ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్‌ ఓపెనింగ్‌ ఫంక్షన్‌ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్‌ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top