దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్‌ | Nithya Menen Auctions Her Dress For Coronavirus Charity | Sakshi
Sakshi News home page

దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్‌

May 21 2020 8:55 AM | Updated on May 21 2020 10:05 AM

Nithya Menen Auctions Her Dress For Coronavirus Charity - Sakshi

చెన్నై : కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేస్తోంది.ముఖ్యంగా పేదల జీవితాలు దయనీయంగా మారాయి. అలాంటి వారిని ఆదుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. నటి నిత్యామీనన్‌   నేను సైతం అంటూ సిద్ధమయ్యారు. తన దుస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును కరోనా బాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు.

దీని గురించి నిత్యామీనన్‌ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ఇటీవల ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నానని చెప్పింది. తాను ధరించిన దుస్తులను తన స్నేహతురాలు, డిజైనర్‌ కరోని ప్రత్యేకంగా తయారు చేసిందని చెప్పింది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి పేదల జీవితాలను చిధ్రంగా మార్చేసిందని..అలాంటి వారు మళ్లీ నిలదొక్కుకోవడానికి సాయం చేయాలని భావించినట్లు పేర్కొంది. దీంతో తాను ఫ్యాషన్‌ షోలో ధరించిన దుస్తులతో పాటు సినిమాలో ధరించిన ఖరీదైన దుస్తులను వేలం వేయాలని నిర్ణించానని పేర్కొంది. తద్వారా వచ్చిన డబ్బును నూరు శాతం అర్పణం ట్రస్టుకు చేరుతుందని చెప్పింది. ఆ ట్రస్ట్‌ పేద కుటుంబాలకు సాయం చేస్తుందని నిత్యామీనన్‌ చేప్పింది.   

Advertisement
 
Advertisement
Advertisement