నితిన్‌ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్‌ | Nithin Srinivasa Kalyanam gets Launch Date | Sakshi
Sakshi News home page

Feb 27 2018 1:12 PM | Updated on Feb 27 2018 1:23 PM

Nithin Srinivasa Kalyanam gets Launch Date - Sakshi

హీరో నితిన్‌

ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో నితిన్‌ తన తదుపరి చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఛల్‌ మోహన్‌ రంగ సినిమా ఏప్రిల్‌ 5న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పవన్‌ కళ్యాన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తరువాత దిల్‌ రాజు బ్యానర్‌ లో సతీష్‌ వేగేశ్న దర్శకత‍్వంలో నటించేందుకు నితిన్‌ ఓకె చెప్పాడు. శ్రీనివాస కళ్యాణం‍ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 3న లాంచనంగా ప్రారంభించనున్నారు. అదే నెల 23 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. నితిన్ సరసన రాశీఖన్నా, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement