వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్ | nithin Lie Climax shoot in america | Sakshi
Sakshi News home page

వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్

May 30 2017 10:24 AM | Updated on Sep 5 2017 12:22 PM

వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్

వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్.. నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. హను

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్.. నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ షెడ్యూల్ మొత్తం ఫైట్స్ సీక్వన్స్ మాత్రమే షూట్ చేశారు. ప్రస్తుతం కాలీఫోర్నియాలోని మిడెస్ట్ లో క్లైమాక్స్కు సంబంధించిన సీన్స్ను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్,  నితిన్ల కాంబినేషన్లో వెయ్యి విమానాల మధ్య క్లైమాక్స్ను షూట్ చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్తో లై సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ లోకి మారిపోయినా నితిన్ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అ..ఆ.. సినిమాతో ఓవర్సీస్లోనూ సత్తా చాటిన నితిన్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగానూ ప్రూవ్ చేసుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement