మహేష్కి పోటీ వస్తున్న నితిన్ | Nithin competing with mahesh | Sakshi
Sakshi News home page

మహేష్కి పోటీ వస్తున్న నితిన్

Feb 6 2016 2:51 PM | Updated on Sep 3 2017 5:04 PM

మహేష్కి పోటీ వస్తున్న నితిన్

మహేష్కి పోటీ వస్తున్న నితిన్

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అ..ఆ..(అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి)' పేరుతో సినిమా చేస్తోన్న నితిన్, ఆ సినిమాతో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తొలి సారిగా నితిన్...

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అ..ఆ..(అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి)' పేరుతో సినిమా చేస్తోన్న నితిన్, ఆ సినిమాతో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను చిత్ రయూనిట్ ప్రకటించారు. ముందుగా అ..ఆ..ను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్కు వాయిదా వేశారు. సమంత హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రటించారు యూనిట్.

అయితే అదే సమయంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఆ సినిమాకు వారం ముందుగా నితిన్ సినిమాను రిలీజ్ చేయటం రిస్క్ అంటున్నారు విశ్లేషకులు.

అ.. ఆ.. కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఒక్క వారంలో పూర్తి కలెక్షన్లు రాబట్టం కష్టం. మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న బ్రహ్మోత్సవంకు భారీ హైప్ ఉండటంతో పాటు రిలీజ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తుండటంతో రిలీజ్ తరువాత అ..ఆ.. కలెక్షన్లు భారీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే  గ్యాప్ చూసుకొని విడుదల చేయటం బెటర్ అని భావిస్తున్నారు. మరి నితిన్ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గుతాడో, లేక పోటీకే రెడీ అవుతాడో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement