నితిన్‌ @ 31 | Nithin Andhadhun Telugu Remake Movie Launch | Sakshi
Sakshi News home page

నితిన్‌ @ 31

Feb 25 2020 12:22 AM | Updated on Feb 25 2020 12:22 AM

Nithin Andhadhun Telugu Remake Movie Launch - Sakshi

మేర్లపాక గాంధీ, ‘ఠాగూర్‌’ మధు, సుధాకర్‌ రెడ్డి, నితిన్, యస్‌. రాధాకృష్ణ

‘భీష్మ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న హీరో నితిన్‌ నటిస్తోన్న 31వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై 6వ చిత్రంగా తీయబోతున్న ఈ చిత్రానికి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవంలో హారిక–హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌. రాధాకృష్ణ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ అందించగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జూన్‌ నుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభమవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: హరి కె.వేదాంత్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement