సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి | Nishabdam movie first look release | Sakshi
Sakshi News home page

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి

Sep 12 2019 12:14 AM | Updated on Sep 12 2019 12:14 AM

Nishabdam movie first look release - Sakshi

అనుష్క

గత ఏడాది జనవరిలో విడుదలైన ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అంజలి, మైఖేల్‌ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. బొమ్మలు గీస్తూ చూస్తున్న అనుష్క పోస్టర్‌పై ‘సాక్షి, ఏ మ్యూట్‌ ఆర్టిస్ట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఇందులో సాక్షి అనే మూగ చిత్రకారిణిగా అనుష్క నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్‌ డియో, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌:  కోన వెంకట్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement