రిలీజ్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయింది ‘‘కిరాక్‌ పార్టీ’

Nikhil Siddharth - Interview on Kirrak Party  - Sakshi

నా 15వ సినిమా. సినిమాకు పది రోజుల ముందు నుంచి నా ఫస్ట్‌ సినిమా, 15 సినిమా అనే డిఫరెన్స్‌ తెలీదు. హ్యాపీడేస్‌ అప్పుడు ఎలా నెర్వస్‌గా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. రిలీజ్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయింది’’ అన్నారు హీరో నిఖిల్‌.  శరణ్‌ కొప్పిశెట్టి  దర్శకత్వంలో నిఖిల్‌ సిద్దార్ధ్‌ హీరోగా సిమ్రాన్, సంయుక్తా హెగ్డే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కిరాక్‌ పార్టీ’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా మార్చి16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.

► కొన్ని సినిమాలు మనకు స్పెషల్‌గా ఉండిపోతాయి. ‘హ్యాపిడేస్, యువత, కార్తికేయ’ ఇప్పుడు ఈ సినిమా. మిగతా సినిమాలు హిట్స్‌ అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్‌ను బాగా లవ్‌ చేస్తాం. ఇది నా ఫెవరెట్‌ రోల్‌. నేను కాలేజ్‌ మూవీ చేసి ఆల్మోస్ట్‌ 11ఇయర్స్‌ అయిపోతోంది.

► ఒక ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ నుంచి స్టూడెంట్‌ లీడర్‌ ఎలా అయ్యాడు అనేది కథాంశం. నేను చేసిన అన్నింట్లో  పెర్ఫార్మన్స్‌ చేయడానికి ఎక్కువ స్కోప్‌ ఇచ్చింది. షూటింగ్‌ అప్పుడు కూడా అందరి కంటే ముందే సెట్‌కి వెళ్లిపోయేవాణ్ణి. ఈ క్యారెక్టర్‌ చాలా ఇష్టపడి చేశాను.

► ఈ సినిమా చేస్తుప్పుడు ‘హ్యాపీడేస్‌’ ఫీల్‌ వచ్చింది. ‘హ్యాపీడేస్‌’ తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ కాలేజ్‌ ఫిల్మ్‌ రాలేదు. స్టార్ట్‌ టూ ఎండ్‌ వరకు కాలేజ్‌లోనే ఈ సినిమా నడుస్తుంది. అమ్మాయిల గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత సఫర్‌ అవుతుందనే సెన్సిటీవ్‌ టాఫిక్‌ సినిమాలో ఉంటుంది.

► నా కాలేజ్‌ లైఫ్‌లో రెండు మూడు సార్లు గొడవలు అయ్యాయి. పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లింది. స్టూడెంట్స్‌ అని వదిలేశారు. అలాంటి మెమొరీస్‌ అన్నీ గుర్తొచ్చాయి. నేను, మా డైరెక్టర్, చందూ మెండేటి, సుధీర్‌ వర్మ, నిర్మాతలు అందరూ ఇంజినీర్సే.

► కన్నడ ‘కిర్రిక్‌ పార్టీ’ లాంటి క్యూట్‌ సినిమా మన తెలుగు ఆడియన్స్‌ మిస్‌ కావద్దని రిమేక్‌ చేశాం. ఈ సినిమాలో మార్చనవి రెండే రెండు. ఒకటి హీరోయిన్‌ సంయుక్త హెగ్డే, రెండు మ్యూజిక్‌. సంయుక్త బెస్ట్‌ డ్యాన్సర్, ఫుల్‌ ఎనర్జిటిక్‌. సో ఆమెను రీప్లేస్‌ చేయదలుచుకోలేదు. అలాగే ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌. అంజనీష్‌ లోకనాథ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు.

► అనిల్‌ సుంకరగారు ఈ సినిమా డైరెక్షన్‌లో అస్సలు ఇన్వాల్వ్‌ అవ్వలేదు. కొబ్బరికాయ కొట్టిన రోజు, మధ్యలో ఏదో ఒకసారి వచ్చారు అంతే. చందూ మొండేటి (డైలాగ్స్‌), సుధీర్‌ వర్మ (స్క్రీన్‌ ప్లే)లతో శరణ్‌ వర్క్‌ చేశాడు. వాళ్లిద్దరూ నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అలా వాళ్లు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

► తమిళ ‘కణిదన్‌’ రీమేక్, కార్తికేయ సీక్వెల్‌లో నటిస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top