నిహారిక పెళ్లి చేసుకోబోయేది ఇతడినే..! | Niharika Konidela Will Marry Chaitanya Jonnalagadda | Sakshi
Sakshi News home page

నిహారిక పెళ్లి చేసుకోబోయేది ఇతడినే..!

Jun 18 2020 10:46 PM | Updated on Jun 18 2020 11:36 PM

Niharika Konidela Will Marry Chaitanya Jonnalagadda - Sakshi

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి గురించి పలువార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన పెళ్లి విషయమై అభిమానులకు హింట్‌లు ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫొటోను కూడా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పీక్‌ ఏ బూ’ అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. నిహారిక ఆ పోస్ట్‌ చేసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పారు. మరికొందరు ఫేస్‌ చూపించాలని కోరారు. (చదవండి : కాబోయే భర్త ఫోటో షేర్‌ చేసిన నిహారిక!)

అయితే తాజాగా నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement