ఒక మంచి రోజు చూసి చెబుతా! | Niharika about Oru Nalla Naal Paathu Solren | Sakshi
Sakshi News home page

ఒక మంచి రోజు చూసి చెబుతా!

Nov 20 2017 1:00 AM | Updated on Nov 20 2017 1:00 AM

Niharika about Oru Nalla Naal Paathu Solren - Sakshi

ఏం చెబుతారు? తమిళ ప్రేక్షకులకు మంచి కథ! అంతే కదా... మంచి కథ కావడం వల్లే తమిళంలో సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారీ తెలుగమ్మాయ్‌! ‘ఒక మనసు’ సిన్మాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నిహారిక తమిళ తెరకు పరిచయమవుతున్న సినిమా ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’. ఒక మంచి రోజు చూసి చెబుతా... తమిళ టైటిల్‌కి తెలుగు మీనింగ్‌! ఇందులో విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ హీరోలు.

విజయ్‌ సేతుపతికి జోడీగా నిహారిక నటిస్తున్నారట. ప్రేక్షకులకు సినిమా చూపించే మంచి రోజుని ఎప్పుడు నిర్ణయించారో గానీ... అంతకంటే ముందు అందులో ప్రేక్షకులకు నిహారిక ఎలా కనిపించేదీ చూపించేశారు చిత్రబృందం. ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్లరేన్‌’లో సౌమ్య అలియాస్‌ అభయలక్ష్మీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. డ్యూయల్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ అని సమాచారమ్‌! ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి, విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు ఆలోచిస్తున్నారట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement