పాతిక... పదహారు! | Nidhi Agarwal Joins Jayam Ravi In JR 25 | Sakshi
Sakshi News home page

పాతిక... పదహారు!

Jun 22 2019 2:05 AM | Updated on Jul 14 2019 10:21 AM

Nidhi Agarwal Joins Jayam Ravi In JR 25 - Sakshi

జయం రవి, నిధీ అగర్వాల్‌

నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి 16ఏళ్లు పూర్తి కావడం ఒకటి, కెరీర్‌లో 25వ చిత్రం ప్రారంభం కావడం మరొకటి... ఇలా రెండు సెలబ్రేషన్స్‌తో ఖుషీగా ఉన్నారు తమిళ నటుడు ‘జయం’ రవి. లక్ష్మణ్‌ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తారు.

చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో ‘జయం’ రవి రైతు పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. అలాగే 2003లో ‘జయం’ (తెలుగు ‘జయం’ చిత్రానికి తమిళ రీమేక్‌) సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రవి ఆ సినిమా హిట్‌తో ‘జయం’ రవిగా మారారు. ఆ సినిమా వచ్చి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన 25వ చిత్రం ప్రారంభోత్సవంలో  కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు ‘జయం’ రవి.

Advertisement
 
Advertisement
Advertisement