ముచ్చటగా మూడోది? | niddhi agarwal romance with vaishnav tej | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోది?

Nov 6 2018 2:17 AM | Updated on Jul 14 2019 10:21 AM

niddhi agarwal romance with vaishnav tej - Sakshi

నిధి అగర్వాల్‌

ఒక సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాలో యాక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేస్తే లక్కీ అంటారు. ముచ్చటగా మూడో సినిమా అవకాశం కూడా కొట్టేస్తే? నిధి అగర్వాల్‌ అంటారు. నాగచైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్‌. ‘సవ్యసాచి’ సెట్స్‌లో ఉండగానే అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు మూడో సినిమాకు సంతకం చేసి నట్టు సమాచారం. సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి కథానాయికగా ని«ధి అగర్వాల్‌ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్‌ అసిస్టెంట్‌ దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్టర్‌.

Advertisement
 
Advertisement
Advertisement