‘అలాంటిదేం లేదు. ఇంకా సమయం ఉంది’ | Nick Jonas Simple Answer About Having Baby Question | Sakshi
Sakshi News home page

‘అందుకు కొంచెం సమయం కావాలి’

Apr 18 2019 6:30 PM | Updated on Apr 18 2019 6:49 PM

Nick Jonas Simple Answer About Having Baby Question - Sakshi

న్యూయార్క్‌లోని మెట్‌గాలా ఈవెంట్‌లో జంటగా కనిపించిన నాటి నుంచి హాలీవుడ్‌, బాలీవుడ్‌ వార్తా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ప్రియానిక్‌ గురించే చర్చ జరిగింది. వయస్సులో పదేళ్ల వ్యత్యాసం గల ఈ జంట ప్రేమపక్షులుగానే మిగిలిపోతారా లేదా పెళ్లి బంధంతో ఒక్కటవుతారా అనే విషయం గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. అంతేకాదు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా వలలో మా హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ చిక్కుకోడంటూ పలువురు కామెంట్‌ చేశారు కూడా. అయితే వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ గతేడాది డిసెంబరు 1న రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ స్టార్‌ కపుల్‌. అయితే ఇదంతా మూడునాళ్ల ముచ్చటేనని.. ప్రియాంక డామినేషన్‌ భరించలేక నిక్‌ త్వరలోనే భార్యకు విడాకులు ఇవ్వడున్నానని మరికొందరు గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక కొన్ని పత్రికలైతే ఏకంగా వీళ్ల విడాకులను ఖరారు చేశాయి కూడా.

ఈ విషయాలపై స్పందించిన ప్రియానిక్‌ జంట అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం తాము జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నామని కూల్‌గా చెబుతూనే... తమ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుక సిద్ధమయ్యారు కూడా. అయితే ఈ జంటకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా మీడియా మాత్రం ఎప్పుడూ వీరిని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రియాంక తల్లికాబోతుందంటూ మరో వార్త ప్రచారం అవుతోంది. ఈ వార్తలపై స్పందించిన ప్రియాంక భర్త నిక్‌.. ‘అలాంటిదేం లేదు. అందుకు కొంచెం సమయం తీసుకోవాలని భావిస్తున్నాం’ అంటూ సింపుల్‌గా విషయాన్ని తేల్చేశాడు. దీంతో ఇకనైనా తమపై ఫోకస్‌ కాస్త తగ్గిస్తే బాగుంటుందంటూ నిక్‌ చెప్పకనే చెప్పాడని అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement