బ్యాక్‌ టు బ్యాక్‌

Next two Trisha films to be produced by All In Pictures - Sakshi

లడ్డు కావాలా.. మరో లడ్డూ కావాలా ? అంటూ త్రిష ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నారు తమిళ నిర్మాణ సంస్థ ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌. ఎందుకీ బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్స్‌ అంటే.. త్రిష చేయబోయే తదుపరి రెండు చిత్రాలు ఈ బ్యానరే నిర్మించనుంది కాబట్టి. త్రిష ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతోంది. ఇప్పటికీ సూపర్‌ హిట్స్‌ అందుకుంటూ, టాప్‌ స్టార్స్‌ సరసన నటిస్తున్నారామె. ఆల్రెడీ ఆమె నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉండగానే రెండు సినిమాలు అనౌన్స్‌ చేశారు. ‘‘తమిళంలో మా మొదటి చిత్రం ‘ గొరిల్లా’ విడుదల కాకముందే మరో రెండు సినిమాలు చేస్తున్నాం. త్రిషతో రెండు సినిమాలకు అసోసియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ ప్రాజెక్ట్‌ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ. ‘‘ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌తో రెండు సినిమాలు చేయనుండటం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం వేచి చూడండి’’ అని త్రిష పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top