'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు | New scenes added in Janatha Garage | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

Sep 12 2016 4:09 PM | Updated on Sep 4 2017 1:13 PM

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్ల చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.70కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద  అదే జోరుని కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి మరో రెండు సన్నివేశాలను జత చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో అభిమానులు మళ్లీ చూసే అవకాశాలు ఎక్కువ.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. జనతా గ్యారేజ్ హిట్తో మరింత టాప్ లెవల్కు చేరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారక్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు. కొత్త సన్నివేశాలు జత చేయడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement