చంబల్‌  బందిపోటు | new movie Chambal bandipotu | Sakshi
Sakshi News home page

చంబల్‌  బందిపోటు

Jan 31 2018 1:12 AM | Updated on Jan 31 2018 1:12 AM

new movie Chambal bandipotu - Sakshi

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌

ఇక్కడ ఉన్న ఫొటో చూశారుగా! సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తుపాకీతో ఎంత గంభీరంగా, స్టైల్‌గా చైర్‌లో కూర్చున్నాడో! ఇలా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే నెక్ట్స్‌ తను నటించబోయే సినిమా కోసం. ‘ఉడ్తా పంజాబ్‌’ ఫేమ్‌ అభిషేక్‌ చౌబే దర్శకత్వంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సోన చిరేయా’. ఇందులో భూమి పెడ్నేకర్‌ హీరోయిన్‌. మనోజ్‌ బాజ్‌పాయి కీలక పాత్రలో కనిపించనున్నారు. చంబల్‌ ప్రాంతంలోని బందిపోటు పాత్రలో కనిపించనున్నారు సుశాంత్‌.

ఈ సినిమా షూటింగ్‌ను రీసెంట్‌గా స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం చంబల్‌లో షూట్‌ చేస్తున్నారు. క్యారెక్టర్‌ ఫర్‌ఫెక్షన్‌ కోసం లోకల్‌ పీపుల్స్‌ను సంప్రదిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాలోని ఫస్ట్‌ లుక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌. ఇప్పటివరకూ ఇలాంటి రఫ్‌ లుక్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కనిపించలేదు. అందుకే లుక్‌ని రిలీజ్‌ చేయగానే బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement