సుశాంత్‌ సింగ్‌ కేసు.. ప్రియురాలికి బిగ్ రిలీఫ్ | Rhea Chakraborty frozen bank accounts released in Sushant Singh case | Sakshi
Sakshi News home page

Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ కేసు.. రియాకు బిగ్ రిలీఫ్

Apr 26 2026 12:13 PM | Updated on Apr 26 2026 1:16 PM

Rhea Chakraborty frozen bank accounts released in Sushant Singh case

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉ‍త్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్‌లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్‌ నటనలో మళ్లీ అడుగుపెట్టింది.  ఆమె ఇటీవలే రోడీస్‌లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement