నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే...

Nela Ticket Movie Trailer release - Sakshi

‘ఫస్ట్‌ టైమ్‌ లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్‌ కనిపిస్తో్తంది’ అంటూ ప్రారంభమయ్యే ‘నేల టిక్కెట్టు’ చిత్రం ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఎస్‌ఆర్‌టి ఎంటరై్టన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

‘చుట్టూ జనం.. మధ్యలో మనం.. అది కదరా లైఫ్‌... ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు... ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ వంటి అర్థవంతమైన డైలాగులు ఒకవైపు.. ‘నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా. ఇదే మూడ్‌ మెయిన్‌టైన్‌ చెయ్‌... నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’... వంటి రవితేజ మార్కు మాస్‌ డైలాగులు మరోవైపు... మొత్తంగా ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై క్రేజ్‌ పెంచేస్తున్నాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని  దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top