అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు: నీతూ కపూర్‌ | Neetu Kapoor Thanks Mukesh Ambani And Family For Support Them | Sakshi
Sakshi News home page

అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు: నీతూ కపూర్‌

May 5 2020 4:40 PM | Updated on May 5 2020 4:45 PM

Neetu Kapoor Thanks Mukesh Ambani And Family For Support Them - Sakshi

పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుటుంబానికి దివంగత నటుడు రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖేష్‌ అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం తమకందించిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ నీతూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే రెండేళ్లుగా లుకేమియాతో పోరాడుతున్న రిషి కపూర్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత రెండేళ్లు మాకు, కుటుంబానికి  చాలా పెద్ద జర్నీ. ఎన్నో మధుర క్షణాలు, కొన్ని కష్టతరమైన రోజులు కూడా ఉన్నాయి. ఇది భావోద్వేగంతో కూడుకొని ఉన్న సమయం. కష్ట సమయంలో అంబానీ కుటుంబం చూపించిన అమితమైన ప్రేమ వెలకట్టలేనిది. మమ్మల్ని అనేక విధాలుగా జాగ్రత్తగా చూసుకున్నారు. అంబానీ కుటుంబం నుంచి ఎంతో మద్దతు లభించింది. కష్ట కాలంలో ఆ కుటుంబం మాకెంతో సహకరించింది. (మీరందరూ సూపర్‌ హీరోలే: అనిల్‌ కపూర్‌)

‘‘గత ఏడు నెలలుగా రిషి అరోగ్యం బాగోలేదు. ఆ సమయంలో అంబానీ కుటుంబమంతా ఆయన్ను అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకున్నారు. తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ.. రిషి బాధను పొగొట్టడానికి ప్రయత్నించారు. రిషి ఆస్పత్రిలో ఉన్నప్పుడు కుటుంబమంతా వచ్చి పలకరించారు. రిషిపై, మా కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించారు. రిషి వెంటిలేటర్‌పై ఉండి మేము భయపడుతున్న సందర్భంలో మమ్మల్ని ఓదార్చారు. మీపై ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. మీరు చూపించిన నిస్వార్థ ప్రేమకు, అంతులేని ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీలాంటి వారు మాకు తోడుగా ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. రిధిమ, రణబీర్‌ కపూర్‌.. మొత్తం కపూర్‌ కుటుంబం తరుఫున అంబానీ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం’’ అంటూ తన మనుసులోని మాటను నీతూ కపూర్‌ చెప్పుకొచ్చారు. (‘నా ప్రేయసితో బ్రేకప్‌ అయినపుడు నీతూ సాయం చేసింది’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement