నా ఆత్మకథకు అనుమతించను | Nayanthara not allow myBiography | Sakshi
Sakshi News home page

నా ఆత్మకథకు అనుమతించను

Jun 3 2014 11:29 PM | Updated on Sep 2 2017 8:16 AM

నా ఆత్మకథకు అనుమతించను

నా ఆత్మకథకు అనుమతించను

సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయాల ను కూడా ప్రజలు భూతద్దంలో చూస్తారు. అదివారి తప్పుకాదు. సెలబ్రెటీల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అది. సంచలన తారగా పేరుగాంచిన నయనతార

సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయాల ను కూడా ప్రజలు భూతద్దంలో చూస్తారు. అదివారి తప్పుకాదు. సెలబ్రెటీల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అది. సంచలన తారగా పేరుగాంచిన నయనతార సినీ, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ప్రేక్షకుడు తహతహలాడుతాడు. అలాంటి ఆమె ఆత్మకథను రాయడానికి, కథకు డు, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు ఆసక్తి కనబరచకుండా ఉంటా రా? అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే నయనతార అందుకు అంగీకరిస్తారా? ఆ మధ్య దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ బాలీవుడ్‌లో ది డర్టీపిక్చర్ పేరుతో తెరకెక్కి కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
 
 నటుడు శింబు, దర్శకడు, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాను ప్రేమాణం పెటాకులైన సంగతి తెలిసిం దే. అయినా నేటికీ నయనతార క్రేజీ హీరోయిన్‌నే. ప్రస్తుతం ఆమె మాజీ ప్రియుడు శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇలా అదృష్ట, దురదృష్ట సంఘటనల సంగమమే నయన జీవితం. అలాంటి జీవిత కథను రాయడానికి ఒక కథకుడు ముందుకొచ్చారు. అయితే నయనతార ఆయనకు అనుమతివ్వలేదని సమాచారం. మరో యువ దర్శకుడు కూడా నయనతార ఆత్మకథను తెరకెక్కించడానికి ఆసక్తి చూపగా ఆయనకి నయన నో చెప్పేశారు. ఇంతకు ముం దు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా తన ఆత్మకథను తెరకెక్కించడానికి అనుమతి నిరాకరించిన విష యం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement