ఇష్టమైనవి దూరం | nayanthara favourites not becoming sure | Sakshi
Sakshi News home page

ఇష్టమైనవి దూరం

Mar 29 2014 12:55 AM | Updated on Sep 2 2017 5:18 AM

ఇష్టమైనవి దూరం

ఇష్టమైనవి దూరం

క్రేజీ భామ నయనతారకు ఇష్టమయినవి ఒక్కొక్కటి దూరం అవుతున్నాయి. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్ పరంపర కొనసాగిస్తున్నారు.

క్రేజీ భామ నయనతారకు ఇష్టమయినవి ఒక్కొక్కటి దూరం అవుతున్నాయి. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్ పరంపర కొనసాగిస్తున్నారు. అయితే వ్యక్తి గత జీవితంలో మాత్రం కోరుకున్నవి చాలా కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రేమలో ఇప్పటికీ రెండు సార్లు ఘోరంగా ఓడిపోయారు. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ చివరి దశకు చేరి ఊహించని విధంగా విఫలం అయ్యింది. దీంతో ఇక ప్రేమ జోలికి పోరాదని ధృడ నిర్ణయం తీసుకున్న నయనతార నటనపైన పూర్తిగా దృష్టి సారించారు. ఈ సారి మరో ఇష్టమయిన దానికి ఆమె దూరం కావలసిన పరిస్థితి. ఇది వ్యక్తిగత అంశమే. నయనతారకు రొయ్యలు, చేపల పులుసు అంటే చాలా ఇష్టం.
 
 
  ప్రతి రోజు ఆమె ఆహారంలో ఈ వంటకాలు భాగం కావలసిందే. అవుట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినా ఆమె ఇష్టమెరిగిన ప్రొడక్షన్ బాయ్స్ రొయ్యలు, చేపల పులుసు కోసం నానాతంటాలు పడయినా ఏర్పాటు చేస్తుంటారు. నయన అంత ఇష్టంగా భుజించే సీఫుడ్స్‌కు దూరం కావలసిన పరిస్థితి ఎదరయ్యింది. దీనికి కారణం ఆమె నాజూకయిన మేనులో తేడా రావడమే. స్కిన్ సమస్యకు గురయిన నయనతార పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించగా వారు పేల్చిన బాంబు సీ ఫుడ్స్‌కు దూరం కావాలన్నది. ఎంత ఇష్టమయిన రొయ్యలు, చేపల పులుసు కూడా దూరం కావలసి రావడంతో నయన చింత అంతా ఇంతా కాదట. కోట్లున్నా కోరుకున్నది తినలేని పరిస్థితి అంటే ఇదేనేమో.  
 

Advertisement
 
Advertisement
Advertisement