మొహాన్ని దాచుకున్న లేడీ సూపర్‌స్టార్‌

Nayanthara Covered Her Face While Vignesh Shivan Taking Selfie - Sakshi

సౌత్‌లో సూపర్‌స్టార్‌ రేంజ్‌ను అనుభవిస్తున్న హీరోయిన్‌ నయనతార. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు మాస్‌ ఎంటర్‌టైన్‌ మూవీల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే.. నయన్‌ తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది.

తాజాగా విఘ్నేష్‌ శివన్‌, నయన్‌లు కలిసి ఉన్న ఓ పిక్‌ వైరల్‌ అవుతోంది. ఈ సెల్ఫీలో విఘ్నేశ్‌ తన ప్రియురాలిని కూడా బంధించాలని చూస్తున్నా.. నయన్‌ మాత్రం తన చేతులతో మొహాన్ని దాచేసింది. అయితే సిగ్గుతో అలా చేసిందా?.. కొత్త సినిమా లుక్‌ను రివీల్‌ చేయద్దని చేతులు అడ్డు పెట్టావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నయనతార సైరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను పెంచేపనిలో పడింది యూనిట్‌. మరి ఈ ప్రమోషన్‌ ఈవెంట్లకైనా నయన్‌ వస్తుందో లేదో చూడాలి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top