శీను ప్రేయసిగా... | Nayan's Seenugadu Love Story | Sakshi
Sakshi News home page

శీను ప్రేయసిగా...

Apr 17 2015 10:44 PM | Updated on Sep 3 2017 12:25 AM

శీను ప్రేయసిగా...

శీను ప్రేయసిగా...

‘అనామిక’ చిత్రం తర్వాత నయనతార మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు.

‘అనామిక’ చిత్రం తర్వాత నయనతార మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. ఆమె ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ అనువాద చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు పలకరించనున్నారు. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా తమిళనాట ఘన విజయం సాధించిన ‘ఇదు కదిరివేలన్ కాదల్’ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరీ’ పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకుడు.

నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ సినిమా కొత్త అనుభూతి కలిగిస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, సమర్పణ: డాక్టర్ కె. సూర్యారావు.

Advertisement
 
Advertisement
Advertisement