సల్మాన్ ఖాన్- వంశీ పైడిపల్లి సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటిస్తుంది. వచ్చే ఏడాది రంజాన్- 2027 సందర్భంగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.


