తల్లి చీరలో జాన్వీ కపూర్‌ | National Film Awards 2018: Janhvi wore mom Sridevi's saree to the ceremony | Sakshi
Sakshi News home page

తల్లి చీరలో జాన్వీ కపూర్‌

May 4 2018 12:25 AM | Updated on May 4 2018 12:25 AM

National Film Awards 2018: Janhvi wore mom Sridevi's saree to the ceremony - Sakshi

జాన్వీకపూర్b

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్‌ ఖుషీ ఢిల్లీ వెళ్లారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్‌. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement