'నరుడా డోనరుడా' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ | naruda donaruda Theatrical trailer | Sakshi
Sakshi News home page

'నరుడా డోనరుడా' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్

Sep 27 2016 1:55 PM | Updated on Sep 4 2017 3:14 PM

'నరుడా డోనరుడా' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్

'నరుడా డోనరుడా' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్

లాంగ్ గ్యాప్ తరువాత అక్కినేని వారసుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన సినిమా నరుడా డోనరుడా. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను...

లాంగ్ గ్యాప్ తరువాత అక్కినేని వారసుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన సినిమా నరుడా డోనరుడా. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించారు. మల్లిక్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు క్షణం సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు శ్రీ చరణ్, సినిమాటోగ్రాఫర్ షానియల్ డియోలు వర్క్ చేశారు.

సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్గా నటించగా సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. టాలీవుడ్లో ఏ హీరో చేయని సాహసం చేస్తున్న సుమంత్ ఈ సినిమాలో వీర్యదాతగా కనిపిస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న విషయంపై కూడా ఆసక్తి  నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ పేజ్లో రిలీజ్  చేశారు. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేస్తున్న నరుడా డోనరుడాపై మహేష్ ట్రైలర్ రిలీజ్ చేయటంతో మరింత క్రేజ్ ఏర్పడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement