డ్రామా థ్రిల్లర్‌ | Narada Donoruda movie shooting statartrd hyderabad | Sakshi
Sakshi News home page

డ్రామా థ్రిల్లర్‌

Oct 28 2017 12:02 AM | Updated on Oct 28 2017 11:11 AM

Narada Donoruda movie shooting statartrd hyderabad

‘నరుడా డోనరుడా’ సినిమా తర్వాత కొంచెం విరామం తీసుకున్న తరువాత స్పీడు పెంచాడు. ఇప్పటికే మళ్లీ రావా షూటింగ్‌ పూర్తి చేసిన సుమంత్‌ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. అనీల్‌ శ్రీకంఠంని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరు సాంబ శివారెడ్డి, గంగపట్నం శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంలో శుక్రవారం ప్రారంభమైంది. మలయాళ నటి అంజు కురియన్‌ నాయికగా నటిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘డ్రామా థిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. సుమంత్‌ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన కెరీర్‌లో వైవిధ్యంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం అందర్నీ అలరించేలా ఉంటుంది. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్‌.

Advertisement
 
Advertisement
Advertisement