రాజా పోరాటం! | Nara Rohit Third Film Raja Cheyyi Veste | Sakshi
Sakshi News home page

రాజా పోరాటం!

Apr 11 2016 10:46 PM | Updated on Aug 29 2018 3:53 PM

రాజా పోరాటం! - Sakshi

రాజా పోరాటం!

మైండ్‌ను గన్‌లా వాడితే ఆలోచనలు బుల్లెట్లలా దూసుకెళతాయని నమ్మే ఓ హీరో, తోచిందే చేసుకుంటూ వెళ్ళిపోయే విలన్ - వీళ్లిద్దరి మధ్య జరిగిన పోరాటమే ‘రాజా చెయ్యి వేస్తే’.

మైండ్‌ను గన్‌లా వాడితే ఆలోచనలు బుల్లెట్లలా దూసుకెళతాయని నమ్మే ఓ హీరో, తోచిందే చేసుకుంటూ వెళ్ళిపోయే విలన్ - వీళ్లిద్దరి మధ్య జరిగిన పోరాటమే ‘రాజా చెయ్యి వేస్తే’. ఇందులో నారా రోహిత్ హీరో. నందమూరి తారకరత్న పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇషా తల్వార్ చిత్ర కథానాయిక. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కేవలం గడచిన నెల రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు (‘తుంటరి’, ‘సావిత్రి’)తో ప్రేక్షకుల్ని పలకరించిన నారా రోహిత్‌కు ఇప్పుడిది ముచ్చటగా మూడో రిలీజ్.  

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్ స్వరాలు కూర్చిన ఈ చిత్ర గీతాలను ఏ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణల చేతుల మీదుగా ఇటీవలే విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే థియేటరికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తారకరత్న  విలనిజం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement