Pradeep chilukuri
-
భావోద్వేగాలే నా బలం: ప్రదీప్ చిలుకూరి
‘‘చిన్నతనంలో మన బర్త్ డేని తల్లిదండ్రులు ఓ ఎమోషనల్‌లా ఫీలై సెలబ్రేట్ చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేలను పిల్లలు గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేయడం కూడా ఓ మంచి ఎమోషన్స్ . ఇదే ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథాంశం’’ అని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’(2016) సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఇద్దరు పెద్ద హీరోల కోసం రెండు కథలు సిద్ధం చేశాను. కానీ, ఆ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. అలా దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌గారితో మాట్లాడినప్పుడు ఓ మాస్ ఫిల్మ్ చేద్దామన్నారు. ‘అర్జున్స్ సన్నాఫ్ వైజయంతి’లోని తల్లి పాత్రని విజయశాంతిగారు చేస్తేనే చేద్దామని ఆయన స్పష్టంగా చెప్పారు. విజయశాంతిగారికి కథ చెప్పగా కొన్ని మార్పులు సూచించారు.యూపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే కొడుకు అర్జున్స్ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె యాక్షన్స్ సీక్వెన్స్ లు అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్‌గారు సినిమా చూసి, బాగుందని చెప్పడం సంతోషం. అజనీష్ లోకనాథ్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. ఓ దర్శకుడిగా భావోద్వేగాలను ప్రజెంట్ చేయడమే నా బలం’’ అని తెలిపారు. -
కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రాజా పోరాటం!
మైండ్‌ను గన్లా వాడితే ఆలోచనలు బుల్లెట్లలా దూసుకెళతాయని నమ్మే ఓ హీరో, తోచిందే చేసుకుంటూ వెళ్ళిపోయే విలన్ - వీళ్లిద్దరి మధ్య జరిగిన పోరాటమే ‘రాజా చెయ్యి వేస్తే’. ఇందులో నారా రోహిత్ హీరో. నందమూరి తారకరత్న పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇషా తల్వార్ చిత్ర కథానాయిక. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కేవలం గడచిన నెల రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు (‘తుంటరి’, ‘సావిత్రి’)తో ప్రేక్షకుల్ని పలకరించిన నారా రోహిత్‌కు ఇప్పుడిది ముచ్చటగా మూడో రిలీజ్. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్ స్వరాలు కూర్చిన ఈ చిత్ర గీతాలను ఏ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణల చేతుల మీదుగా ఇటీవలే విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే థియేటరికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తారకరత్న విలనిజం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది’’ అన్నారు.