బాణం కాంబినేషన్లో మరో సినిమా | Nara Rohit Teams Up with Baanam Director | Sakshi
Sakshi News home page

బాణం కాంబినేషన్లో మరో సినిమా

Apr 4 2017 11:01 AM | Updated on Aug 29 2018 3:53 PM

బాణం కాంబినేషన్లో మరో సినిమా - Sakshi

బాణం కాంబినేషన్లో మరో సినిమా

డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు. తను హీరోగా

డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు. తను హీరోగా పరిచయం అయిన తొలి సినిమా.. బాణంను డైరెక్ట్ చేసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య తరువాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

రెండో ప్రయత్నంగా బ్రహ్మనందం కొడుకు గౌతమ్ హీరోగా తెరకెక్కించిన బసంతి కూడా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న చైతన్య, మరోసారి తన తొలి చిత్ర హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రోహిత్ కు పొలిటికల్ థ్రిల్లర్ కథ వినిపించి, ఓకె చేయించుకున్నాడు. ఇప్పటికే కథలో రాజకుమారి, పండగలా వచ్చాడు సినిమాలను పూర్తి చేసిన రోహిత్, పవన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చైతన్య దంతులూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement