నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ | Nani And Sudheer Babu V Movie Postponed To April | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌.. ‘వి’ సినిమా వాయిదా

Mar 14 2020 2:08 PM | Updated on Mar 14 2020 2:10 PM

Nani And Sudheer Babu  V Movie Postponed To April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‍ (కోవిడ్‌-19) ఎఫెక్ట్‌  నాని సినిమాపై పడింది. ఈ మహమ్మారి కారణంగా నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా విడుదల వాయిదా పడింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు,శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వ వహించారు. మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి క‌థానాయిక‌లుగా న‌టించారు.
(చదవండి : ఆసక్తికరంగా ‘వి’ టీజర్‌)

సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్టు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.  ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ,  కరోనా వైరస్‌ కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు శనివారం తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్మాతల మండలి భేటి అయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్ల మూసివేతపై చర్చించారు. ప్రభుత్వం ఎప్పుడు చెబితే అప్పుడు థియేటర్లు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement