
జెర్సీ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నాని ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్‌లీడర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే వ్యూహం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీస్టారర్ అన్న ప్రచారం జరుగుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని లీడ్ రోల్ చేయటం లేదట. కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే అతిథి పాత్రలో కనిపించనున్నాడట. కథకు కీలకమైన పాత్ర కావటంతో పాటు తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి సినిమా కావటంతో గెస్ట్ రోల్ నటించేందుకు నాని అంగీకరించినట్టుగా తెలుస్తోంది.