నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

Nani 24 Team Approached Rakul Preet Singh For A Special Song - Sakshi

ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని.. తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. మనం, ఇష్క్‌, 24 సినిమాల దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్‌ సింగ్‌ స్పెషల్‌ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండగా రకుల్‌ ప్రీత్ స్పెషల్‌ సాంగ్ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్ చేయనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top