బాలయ్య వారసుడు సినిమాల్లోకి రాడా..? | Nandamuri Mokshagna is Not Getting Ready to Get Launched | Sakshi
Sakshi News home page

బాలయ్య వారసుడు సినిమాల్లోకి రాడా..?

Jun 11 2019 10:55 AM | Updated on Jun 11 2019 10:55 AM

Nandamuri Mokshagna is Not Getting Ready to Get Launched - Sakshi

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరుగులేని మాస్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే బాలయ్య జనరేషన్‌ హీరోలందరూ తమ వారసులను వెండితెరకు పరిచయం చేసినా.. బాలకృష్ణ మాత్రం ఇంకా మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నాడు.

చాలా కాలం కిందటే త్వరలో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని చెప్పిన బాలకృష్ణ, తరువాత సైలెంట్ అయిపోయాడు. అయితే మోక్షజ్ఞకు హీరో అయ్యే ఆలోచన లేదన్న టాక్‌ కూడా గట్టిగానే వినిపిస్తోంది. బిజినెస్‌లో ఎదగాలనకుంటున్న మోక్షజ్ఞ ఇప్పటి వరకు నటన మీద దృష్టి పెట్టలేదన్న ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్‌ లో గట్టిగా వినిపిస్తోంది.

ఇటీవల ఒకటి, రెండు సార్లు కెమెరా కంటపడ్డ మోక్షజ్ఞను చూస్తే ఈ వార్తలు నిజమే అనిపిస్తాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఏ మాత్రం సిద్ధంగా లేడన్న విషయం అర్థమవుతోంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలోనూ నందమూరి వారసుడు చబ్బీ చబ్బీగా కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ డౌటే అన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి. మరి ఇప్పటికైన బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement