కల్యాణ్‌ రామ్‌తో ఆదిత్య తొలి అడుగు

 Nandamuri Kalyan Ram's next to be produced by Aditya Music - Sakshi

ఆదిత్య మ్యూజిక్‌.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్రవేసిన ఆదిత్య మ్యూజిక్‌ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా తెలుగులో తొలి సినిమా నిర్మించనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్‌ వేగేశ్న సతీష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణ్‌రామ్‌కి జోడీగా మెహరీన్‌ నటించనున్నారు. ‘జెంటిల్‌మన్, సమ్మోహనం’ వంటి హిట్‌చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. ‘గీత గోవిందం, మజిలీ’ వంటి మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్స్‌ అందుకున్న గోపీసుందర్‌ ఈ సినిమాకి స్వరకర్త. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వేగేశ్న సతీష్‌ కథను సిద్ధం చేసుకున్నారు’ అని చిత్రనిర్మాత ఉమేష్‌ గుప్తా తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top