మోహన్ లాల్తో మరో నందమూరి హీరో | Nandamuri Heros Surprise In Mohanlals Film | Sakshi
Sakshi News home page

మోహన్ లాల్తో మరో నందమూరి హీరో

Jul 24 2016 7:10 AM | Updated on Sep 4 2017 6:04 AM

మోహన్ లాల్తో మరో నందమూరి హీరో

మోహన్ లాల్తో మరో నందమూరి హీరో

నందమూరి యంగ్ హీరో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ మళయాల...

నందమూరి యంగ్ హీరో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ మళయాల సూపర్ స్టార్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో మరో నందమూరి హీరో నటిస్తున్నాడు.

తొలిసారిగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు సినిమా మనమంతా. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి తారకరత్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రాజా చెయ్యివేస్తే సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న తారక రత్న, మనమంతా లో మాత్రం పాజిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement