చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు | Nandamuri Balakrishna Visits Ramalingeswara Swami Temple | Sakshi
Sakshi News home page

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

Jul 27 2019 10:42 AM | Updated on Jul 27 2019 4:07 PM

Nandamuri Balakrishna Visits Ramalingeswara Swami Temple - Sakshi

సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకాలను బాలకృష్ణ, మోక్షజ్ఞలు నిర్వహించారు. బాలకృష్ణ నూతనంగా నిర్మించే చిత్రానికి సంబంధించి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు నాగమల్లేశ్వర సిద్ధాంతి తెలిపారు. అయితే బాలకృష్ణ పర్యటన గోప్యంగా ఉంచారు. ప్రత్యేక పూజలు అనంతరం బాలకృష్ణ, ఆయన కుమారుడు ప్రత్యేక వాహనాల్లో విడివిడిగా వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement