బాలయ్యకు షష్టిపూర్తి; చిరు ట్వీట్‌ | Nandamuri Balakrishna Turns 60: Chiranjeevi Wishes | Sakshi
Sakshi News home page

బాలయ్య పుట్టిన రోజు; చిరంజీవి ట్వీట్‌

Jun 10 2020 9:41 AM | Updated on Jun 10 2020 12:08 PM

Nandamuri Balakrishna Turns 60: Chiranjeevi Wishes - Sakshi

హీరో నందమూరి బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: హీరో నందమూరి బాలకృష్ణకు మెగాస్టార్‌ చిరంజీవి, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ట్విటర్‌ ద్వారా షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలిపారు. నేడు(జూన్‌ 10) బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ ఇదే ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో అందరి అభిమానం పొందాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని మోహన్‌బాబు కోరుకున్నారు.

బాలకృష్ణకు కుటుంబ సభ్యులు, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు శుభాంక్షాలు తెలుపుతున్నారు. ‘బాబాయ్‌ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. తండ్రి ఎన్టీఆర్‌ వారసత్వాన్ని బాలయ్య ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సీనియర్‌ నటుడు, ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో విడుదల చేసిన లుక్‌, వీడియో అభిమానులను అలరిస్తోంది. (బాలయ్య టీజర్‌ వచ్చేసింది..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement