ఆయన ఎవరో కూడా తెలియదు..! | namitha comment on marriage rumors | Sakshi
Sakshi News home page

శరత్‌బాబుతో పెళ్లి వదంతులు.. నమిత స్పందన

Oct 18 2017 7:13 PM | Updated on Oct 18 2017 7:16 PM

namitha comment on marriage rumors

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు, ప్రముఖ నటి న‌మిత పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్య వదంతులు గుప్పుమన్న సంగతి తెలిసిందే. శరత్‌బాబు-నమిత సహజీవనం చేస్తున్నారంటూ చెలరేగిన రూమర్లు కలకలం రేపాయి. ఇప్పటికే శరత్‌బాబు ఈ రూమర్‌ను కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా నమిత కూడా ఇది వదంతి అని తేల్చేశారు.

తమిళ బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న అనంతరం స్వరాష్ట్రం గుజరాత్‌ వెళ్లిపోయిన ఆమె.. తాజాగా శరత్‌బాబుతో పెళ్లి రూమర్లపై స్పందించినట్టు తెలుస్తోంది. 'శ‌ర‌త్ బాబు ఎవ‌రో నాకు సరిగ్గా తెలియ‌దు. రూమ‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత ఆయన గురించి ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నాకంటే రెట్టింపు వ‌యసున్న వ్యక్తిని నేనెలా పెళ్లి చేసుకుంటాను. ఈ వార్త పూర్తి అబ‌ద్ధం. ఇది ఎలా వ‌చ్చిందో నాకు అర్థం కావ‌డం లేదు‌' అని న‌మిత పేర్కొన్నట్టు సమాచారం.

నమితతో శరత్‌బాబు పెళ్లి అంటూ ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి గతంలో ‘సాక్షి’ ఫోన్‌ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే.. ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్‌ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది.

రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్‌ టాపిక్కే. రాముడికి క్లీన్‌ ఇమేజ్‌ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది. రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్‌ జర్నలిస్ట్‌ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్‌ జర్నలిస్ట్‌ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్‌ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్‌ అండి. ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అంటూ శరత్‌బాబు గతంలో ఈ పుకారుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement