చైతూ సినిమాలో నాగ్, వెంకీ | Nagarjuna venkatesh guest appearence in nagachaithanya film | Sakshi
Sakshi News home page

చైతూ సినిమాలో నాగ్, వెంకీ

Oct 30 2015 9:50 AM | Updated on Jul 15 2019 9:21 PM

చైతూ సినిమాలో నాగ్, వెంకీ - Sakshi

చైతూ సినిమాలో నాగ్, వెంకీ

టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్లతో అదరగొడుతున్నారు...

టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్లతో అదరగొడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేయటంతో మరో ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి కాంబినేషన్ తెర మీద సందడి చేయనుంది.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా పూర్తవ్వగానే మళయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్లో నటించనున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తుంది. చైతూ సరసన మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఓ ఇంపార్టెంట్ రోల్ను సీనియర్ హీరో వెంకటేష్తో చేయించాలని భావిస్తున్నారు. వెంకీతో పాటు మరో అతిథి పాత్రలో నాగ్ కూడా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యకు ఈ రెండు కుటుంబాల నేపథ్యం ఉండటంతో మజ్ను సినిమాలో నాగ్, వెంకీలు నటించటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాసిప్గా ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement